ఫ్యామిలీ స్టార్’ మూవీ టీం సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. తమ సినిమాపై ఉద్దేశపూర్వకంగా నెట్టింట తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారని, సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరింది. సినిమాపై నెగటివ్ ట్రోలింగ్‌కు సంబంధించిన ఆధారాలను కూడా వారికి సమర్పించినట్లు సమాచారం. మరోవైపు సినిమా నిర్మాత దిల్ రాజు సైతం ప్రెస్‌మీట్‌లో ఇదే విషయంపై ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
