డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘హ్యాపీ డేస్’ మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 19 ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గ్లోబల్ సినిమాస్ ఈ చిత్రాన్ని థియేటర్లలో రీరిలీజ్ చేయనుంది. కాగా ఈ మూవీలో వరుణ్ సందేశ్, నిఖిల్ సిద్ధార్థ, తమన్నా, కమలినీ ముఖర్జీ కీలకపాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా 2007లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
