అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజైన ‘పుష్ప-2’ టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియో విడుదలైన కేవలం 40 నిమిషాల్లోనే రెండు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈక్రమంలో బన్నీకి బర్త్ డే విషెస్ తెలుపుతూ టీజర్ అదిరిపోయిందని నేచురల్ స్టార్ నాని ట్వీట్ చేశారు. సుకుమార్, బన్నీ మాత్రమే ఇలాంటివి చేయగలరంటూ అభినందించారు. నటి అనసూయ సైతం ప్రశంసలతో ముంచెత్తారు.
