మన్యం న్యూస్, మంగపేట.
తెలుగువారి రైతు పండుగ ఉగాది అని తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించేలా రైతులు ఉగాది పండుగ జరుపుకోవాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అకినేపల్లి మల్లారంలో వికాస్ అగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రోధి నామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి వరి విత్తన పంట క్షేత్రాలను విత్తన సంస్థ ప్రతినిధులు స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ ఈ నూతన తెలుగు సంవత్సరాది ప్రజలందరికీ మేలు చేయాలని ముఖ్యంగా వర్షాలు సకాలంలో కురిసి వ్యవసాయ రంగం నూతన వరవడితో పరుగులు తీయాలని ఆయన ఆకాంక్షించారు రైతులు సాధారణ సాగు కంటే విత్తనోత్పత్తి పద్ధతిలో వరి సాగు చేయడం ద్వారా అధిక దిగుబడును అదనపు రాబడులను పొందవచ్చునని అన్నారు అనంతరం వికాస్ అగ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలలో ఉగాది పచ్చడి స్వీకరించి పండితులచే పంచాంగ శ్రవణం చేశారు. ఉదయం గ్రామంలో గల అభయాంజనేయ స్వామి దేవాలయం సీతారామచంద్రస్వామి దేవాలయాలలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరి కోత మిషన్ హార్వెస్టర్ నడిపి స్థానిక రైతుల్లో ఉత్సాహం నింపి సందడి చేశారు. ఉగాది వేడుకల్లో శ్రీ కిన్నెరా సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మేకన జగన్మోహన్ రావు స్థానిక రైతులు కృష్ణారెడ్డి నరసింహారావు మాధవరెడ్డి వ్యవసాయ కూలీలు సాంబశివరెడ్డి వ్యక్తిగత మరియు కార్యాలయ సిబ్బంది తిరుపతిరావు ప్రసాద్ నాని తదితరులు పాల్గొన్నారు.