మన్యం న్యూస్ గుండాల: మండలం పరిధిలోని
పడుగోని గూడెం గ్రామంలోని రామాలయ ప్రాంగణంలో లోని ఉమామహేశ్వర స్వామి ఆలయ జీవద్వజ శిఖర ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమాలను మూడు రోజులు భక్తి శ్రద్దల నడుము అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ సముదాయ ధర్మకర్త గడేపల్లి లోకేశ్వర రావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 10 వ తేదీ బుధవారం నుండి 12 తేదీ శుక్రవారం వరకు త్రయాహ్నిక దీక్షతో బ్రాహ్మణోత్తములచే పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తధానంతరం చివరి రోజు12వ తేదీన భక్తులకుఅన్నదాన కార్యక్రమంనిర్వహించబడునని ఆలయ పూజారి వుకె నాగయ్య కుటుంబ సభ్యులు ,గ్రామ పెద్దలు మంగళవారం , రామాలయగుడి వద్ద పోస్టర్ విడుదల చేశారు.కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ ఉమామహేశ్వర ఆలయ జీవద్వజ శిఖర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి భక్తులు సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు