మన్యం న్యూస్ గుండాల: పోగొట్టుకున్న రెండు చరవాణి లను సిర్ టెక్నాలజీ ఉపయోగించి వెతికి పట్టుకొని బాధితులకు అప్పగించిన గుండాల పోలీసులు ఈ నెల లో అనుకోకుండా రెండు చరవానిలను పోగొట్టుకున్న బాధితులు గుండాల పోలీస్ స్టేషన్ నందు బాధితులు ఫిర్యాదు చేయగా బాధితుల యొక్క ఫిర్యాది మేరకు గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ సీర్ పోర్టల్ టెక్నాలజీని ఉపయోగించి మూడు రోజుల వ్యవధిలోనే పోగొట్టుకున్న చరవానిలను వెతికి పట్టుకున్నారు. బాధితులను పిలిపించి చరవానిలను బాధితులకు అందజేశారు. అనంతరం ఎస్సై కిన్నెర రాజశేఖర్ మాట్లాడుతూ పోగొట్టుకున్న 14 చరవాణిలను అప్పగించామని ఇకమీదట పోగొట్టుకున్న వారు బాధపడాల్సిన పనిలేదని వెంటనే గుండాల పోలీస్ స్టేషన్ మరియు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పోలీసు వారు ప్రవేశపెట్టిన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఫోన్లను వెతికి పట్టుకొని బాధితులకు అప్పగించటం చాలా సంతోషంగా ఉందని దీనియందు కృషిచేసిన గుండాల పోలీస్ సిబ్బంది వెంకట్, రాంబాబు, మంగీలాల్ ,రాము ,సత్యనారాయణ లను ప్రత్యేకంగా సత్కరించి ఇటువంటి మరెన్నో సేవలు చేస్తూ బాధితులకు అండగా ఉంటూ సేవ చేయాలని సూచించారు . పోగొట్టుకున్న ఫోన్లు దొరకవని నిరాశ పడిన మాకు దొరకడం చాలా ఆనందంగా ఉందని పోలీసుల కృషి అభినందనీయమని బాధితులు మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
