UPDATES  

 అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారం..పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి పార్టీలకు ఓడించి బుద్ధి చెప్పాలి…బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కవిత గెలిపించాలి..జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు….

  • అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారం..
  • పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి పార్టీలకు ఓడించి బుద్ధి చెప్పాలి..
  • బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కవిత గెలిపించాలి..జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.

మన్యం న్యూస్ దుమ్ముగూడెం::

శాసనసభ ఎన్నికల్లో అబద్ధపు హామీలు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. సోమవారం మండలంలోని మారాయి గూడెం లచ్చిగూడెం సీతారాంపురం సింగవరం తూరుబాక కొత్తూరు తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు అనంతరం జరిగిన బూత్ కమిటీల ముఖ్య సమావేశం ఆయన మాట్లాడుతూ..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి పార్టీలకు ఓడించి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏ గ్రామంలో వెళ్లిన స్పష్టంగా కనపడుతుందని మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో 60 ఏళ్లుగా మంచినీళ్లు లేక అనేక అవస్థలు పడ్డారని ఇప్పుడు మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందుతుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఢిల్లీ గులాములకు తాకట్టు పెట్టిందని ఆరోపించారు. కెసిఆర్ సూచనలు సలహాలతో బిజెపి ఆలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పార్లమెంటును స్తంభింప చేశారని మన గలాన్ని పార్లమెంట్లో వినిపించే మాలోత్ కవిత గెలుపు కొరకు అందరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ నాయకులు మానే రామకృష్ణ సీనియర్ నాయకులు సాగి శ్రీనివాసరాజు అధ్యక్ష కార్యదర్శులు అన్నే సత్యనారాయణమూర్తి కనితి రాముడు ఎంపీపీ రేసు లక్ష్మి ఉపాధ్యక్షుడు తునికి కామేశ్వరరావు ఆప్క వీర్రాజు మాజీ సర్పంచ్ కొండయ్య వెంకటేశ్వర్లు బొల్లి వెంకటరావు కొత్త మల్లేష్ శ్రీను వెంకటేష్ సుబ్బారావు కామేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !