మన్యం న్యూస్ గుండాల: అభ్యర్థి మోకాళ్ళ మురళికృష్ణ కుండ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల మాజీ సర్పంచ్ సీతారాములు కోరారు. సోమవారం మండలం పరిధిలోని వేపలగడ్డ గ్రామంలో జరిగిన సమావేశంలో మోకాళ్ళ మురళీకృష్ణ ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. బిజెపి అభ్యర్థులను ఓడించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గడ్డం లాలయ్య, పరిశిక రవి, మంగయ్య, ఈసం కృష్ణ, పెంటన్న తదితరులు పాల్గొన్నారు