UPDATES  

 ఉపాధి హామీ కూలీలను కలిసి ఓట్లు ఆభ్యర్ధిస్తున్న బిఆర్ఎస్ నాయకులు.. బిఆర్ఎస్ పార్టీపై ప్రజలు చూపిస్తున్న ప్రజాధారణ చూసి భయపడి రైతు బంధు డబ్బులూ వేశారు -ఎంపీపీ జల్లిపల్లి..

  • ఉపాధి హామీ కూలీలను కలిసి ఓట్లు ఆభ్యర్ధిస్తున్న బిఆర్ఎస్ నాయకులు
  • బిఆర్ఎస్ పార్టీపై ప్రజలు చూపిస్తున్న ప్రజాధారణ చూసి భయపడి రైతు బంధు డబ్బులూ వేశారు -ఎంపీపీ జల్లిపల్లి

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 07: అశ్వారావుపేట మండలం రామన్న గూడెం, అనంతరం, గాండ్లగుడెం, నారాయణ పురం గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలను కలిసి ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నా నామ నాగేశ్వరరావు రావును గెలిపించాలని, కారు గుర్తుపై ఓటు వేసి నామ నాగేశ్వరరావుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి కోరారు. ఆరు గ్యారంటీల్లో ఐదో అమలు అయ్యాయని కాంగ్రెస్ పార్టీ అంటుంది కానీ ఆరులో ఐదో గ్యారంటీలు అమలు కాలేదనీ, ఆరులో మొదటి గ్యారంటీ మహాలక్ష్మీ పథకం ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు, అమలైందా? కాలేదు..! రెండో గ్యారంటీ రైతులకు, వడ్లకు, మొక్కలకు 500 రూపాయిల బోనస్, వ్యవసాయ కూలీలకు 12వేలు. అమలైందా, కాలేదు. మూడో గ్యారంటీ 100 రోజుల్లో పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు. 250 గజాల స్థలం ఇస్తామన్నారు, ఒకరికైనా ఇచ్చారా? మూడో గ్యారంటీ ఫెయిల్ అని, నాలుగోది యువ వికాసం, విద్యార్థులందరికీ 5లక్షల విద్యా భరోసా కార్డు, నిరుద్యోగ భృతి అన్నారు, నాలుగోది కూడా అమలు కాలేదు ఫెయిల్ అని తెలిపారు. ఐదో గ్యారంటీ చేయూత.. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, ఆసరా పెన్షన్ దారులకు 4వేల పెన్షన్ ఇస్తామన్నారు, ఐదో గ్యారంటీ ఇవ్వలేదు ఫెయిల్ అన్నారు. ఆరులో ఐదో గ్యారంటీలు కాలేదనేది నిజం అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండు సార్లు ఇవ్వలసిన రైతు బంధు డబ్బులూ ఇవ్వకుండా ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని భావించి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కెసిఆర్ గారి బస్సు యాత్రలో పాల్గొనే కార్యకర్తలను చూసి ఓటమి భయంతో రాత్రికి రాత్రి రైతు బంధు డబ్బులూ వేశారని అదికూడా రెండూ సార్లు పడవలసిన డబ్బులకు ఒకసారివి మాత్రమే వేశారని తెలియజేస్తూ బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థులను పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతులను గెలిపించు కొని తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను అమలు పరచుకుందమని తెలుపుతూ కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో నామ నాగేశ్వర రావుని గెలిపించమని ప్రజలను ఈ సందర్బంగా అశ్వారావుపేట మండల బిఅర్ఎస్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, జడ్పీటీసీ చిన్నాంశెట్టి వరలక్ష్మి, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి యుఎస్ ప్రకాష్ రావు, దిశ కమిటీ మెంబర్ నారం రాజ శేఖర్, మండల నాయకులు తాడేపల్లి రవి, కాసాని చంద్రమోహన్, అంకత మల్లిఖార్జున రావు, మందపాటి మోహన్ రెడ్డి, వెంకట నరసింహం, ఆయా గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !