మన్యం న్యూస్ గుండాల: బిఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లే ప్రభుత్వం దిగివచ్చి రైతుబంధు నిధులను విడుదల చేసిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు . బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ రైతులలో రైతులలో తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను రైతులకు వివరిస్తూ బస్సుయాత్ర చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దిగి వచ్చిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు
