UPDATES  

 కాంగ్రెస్ గూటికి చేరిన కంది సుబ్బారెడ్డి… బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీగా గెలుపొంది వైస్ ఎంపీపీగా ఎన్నిక..

  • కాంగ్రెస్ గూటికి చేరిన కంది సుబ్బారెడ్డి.
  • బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీగా గెలుపొంది
  • వైస్ ఎంపీపీగా ఎన్నిక.
  • అసెంబ్లీ ఎన్నికల అనంతరం బిఆర్ఎస్ కు దూరమైన కంది సుబ్బారెడ్డి
  • పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

మన్యం న్యూస్, పినపాక:

బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా గతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ, కొత్తదనాన్ని కోరుకుంటున్న ప్రజానీకం కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపారు. పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు నియోజకవర్గాన్ని కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశాడు. కానీ పార్టీ నాయకులుగా, ప్రజలకు అన్ని రకాల సేవలను అందించిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా హస్తానికి చేయి అందిస్తున్నారు. పినపాక నియోజకవర్గంలో అభివృద్ధిలో తనదైన మార్కు వేసుకున్న రేగా కాంతారావుకు చేదోడు వాదోడుగా ఉన్న నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ కి చేతులు అందిస్తున్నారు. ఎన్నికలకు పూర్వమే కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరగా, గెలిస్తే రేగాకాంతారావు తోటి, లేకపోతే కాంగ్రెస్ గూటికి అనుకున్న నాయకులు చిన్నగా జారుకుంటున్నారు. ఐదు సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో సాయాన్ని పొందిన వారు ఓడదాటే దాకా ఓడ మల్లయ్య, ఓడ దాటాక బోడ మల్లయ్య అంటూ ఒక్కొక్కరుగా బిఆర్ఎస్ పార్టీకి దూరమవుతున్నారు. తాజాగా పినపాక మండల వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. నాయకుడిగా కాకుండా మానవత్వం ఉన్న వ్యక్తిగా మండల ప్రజలకు సుపరిచితుడైన కంది సుబ్బారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో, రేగా కాంతారావుకు ఆత్మీయుడుగా ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పలువురు చర్చించుకుంటున్నారు. పినపాక మండలంలో ఇప్పటికే కొన్ని సిత్రాలు జరిగాయని, ఇంకా ఇలాంటి రాజకీయ సిత్రాలు ఎన్ని చూడ వస్తుందోనని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !