తాజాగా బీహార్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర నేరాలకు పాల్పడి సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించిన అశోక్ మహతో (56) ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను సంప్రదించారు. పెళ్లి చేసుకుంటే భార్యకు టికెట్ ఇస్తామని లాలూ సూచించారు. అతను 56 ఏళ్ల వయసులో 46 ఏళ్ల అనితను వివాహం చేసుకున్నాడు. మాట ప్రకారం మహతో భార్య అనితకు RJD ముంగేర్ నుండి సీటు కేటాయించింది.
