మన్యం న్యూస్, పినపాక:
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను పినపాక తహసిల్దార్ టి సూర్యనారాయణ పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు, మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని పోలింగ్ కేంద్రాల నిర్వాహక సిబ్బందిని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సిబ్బందికి తాగు నీరు, భోజన వసతి, మూత్ర శాలలు, విద్యుత్ సౌకర్యం లో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్. ఐ కే బాలకృష్ణ, కార్యదర్శి జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.