భారత్ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్న రష్యా ఆరోపణలపై అమెరికా స్పందించింది. ‘భారత ఎన్నికల్లో మేం జోక్యం చేసుకోవడం లేదు.. ఎవరిని ఎన్నుకోవాలనేది భారత ప్రజల నిర్ణయమని స్పష్టం చేశారు. ప్రపంచంలోని ఏ దేశ ఎన్నికల్లోనూ తాము జోక్యం చేసుకోబోమని అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ హత్య కేసు విచారణలో ఉందని, ఇప్పుడు దాని గురించి మాట్లాడలేనని అన్నారు.