భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచుతున్నప్పటికీ ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను తీర్చడానికి సరిపోవడంలేదు. జీడీపీలో 0.7శాతాన్ని మాత్రమే పరిశోధన-అభివృద్ధికి ప్రత్యేకిస్తున్న భారత్ ఈ కేటాయింపులను పెద్దయెత్తున పెంచాలి. శాస్త్ర, సాంకేతిక రంగానికి కేటాయిస్తున్న అరకొర నిధులతోనే మన శాస్త్రవేత్తలు అపూర్వ విజయాలు సాధిస్తున్నారు. బడ్జెట్ పెంపుతో మరిన్ని అద్భుతాలు సాధించే అవకాశముంది.