నటుడు రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి రేపు పిఠాపురం వెళ్లనున్నారు. ఉదయం 9.30 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకోనున్న వారు అక్కడి నుంచి పిఠాపురం వెళ్తారు. అనంతరం స్థానిక కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రచార గడవు ముగియనున్నది. బాబాయ్ పవన్ కళ్యాణ్ తరపున అబ్బాయ్ ఏమైనా ప్రచారం చేస్తారా? లేదా? అన్నది తెలుస్తుంది.