UPDATES  

 అందరూ దొంగలేనా..? ఒకవైపు ఎలక్షన్లు మరోవైపు జోరుగా మందు విక్రయాలు…

  • అందరూ దొంగలేనా?
  •  ఒకవైపు ఎలక్షన్లు మరోవైపు జోరుగా మందు విక్రయాలు.
  •  గుడుంబా అరికట్టడంలో విఫలమైన ఎక్సైజ్ శాఖ.
  • సిగ్గులేని ప్రభుత్వ ఎక్సైజ్ అధికారుల పనితీరు వర్ణరహితం.
  •  మద్యం ఏరులై పారుతున్న అరికట్టలేని పరిస్థితి.
  •  అడ్రస్ చెప్పినా స్పందించనిఎక్సైజ్ అధికారులు.
  •  పలు అనుమానాలకు తావినిస్తున్న వారి వైఖరి.
  •  ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే వారు స్పందిస్తారో.
  •  మొన్నటికి 97 మంది, మరో ఇద్దరు మరణించడానికి రెడీ.
  •  మద్యం విక్రయదారులు ఎక్సైజ్ శాఖ అధికారులు కుమ్మక్కయ్యారా?.
  •  ఈ విషయం పట్లఎక్సైజ్ పెద్ద సారు బుద్ధి ఏమైంది?
  • ,ఎందుకు మౌనం పాటిస్తున్నారు.
  •  గుడుంబా విక్రయాలలో పెద్ద సార్ కు వాటా ఉందా.?
  •  ఏజెన్సీ మండలాలలో గుడుంబాని అరికట్టే అధికారి ఎవరు?. ఎక్కడున్నారు?

మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం

వెంకటాపురం మండల కేంద్రంలో నాయకులు గూడెం, వీరభద్రారం గ్రామంలో మద్యం ఏరులై పారుతుంది, మద్యం తాగి ఎంతోమంది యువకులు ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు నాయకులగూడెం వీరభద్రవరం గ్రామంలో చోటుచేసుకున్నాయి . ఈ విషయం పట్ల ఎన్నిసార్లు పత్రికలో ప్రచురించిన సంబంధిత అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడకపోవడం దున్నపోతు మీద వాన కురిసిన అన్న సందంగా వారి వైఖరి ఉన్నట్టు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. పిల్లలు చనిపోతున్నారు మహాప్రబో అని పిల్లల తల్లిదండ్రులు గగ్గోలు పెట్టినా ఎక్సైజ్ అధికారులు ఏం పట్టనట్టు వ్యవహరించడం మండల ప్రజలని కలవరపరుస్తున్న విషయం, అసలు భారీగా విక్రయాలు జరుగుతున్న నాయకులగూడెం వీరభద్రారం వైపు కన్నెత్తి అయినా చూడకపోవడం ఏమిటి? ఆచూకీ తెలిపిన పట్టించుకోరా అంటే వారు ప్రవర్తిస్తున్న తీరు లంచాల కోసమే బతుకుతున్నారేమో అన్న విధంగా ఉంది అని మండల ప్రజలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు ఈ మద్యం దందాకు అధికారి ఎవరు,?ఎన్నిసార్లు మండల ప్రజలు గగ్గోలు పెట్టిన పత్రికలలో ప్రచురించిన, నాయకులగూడెం,వీరభద్రారం వైపు కన్నెత్తి చూడరు ఎందుకు ,,?

నాయకులగూడెంలో 97 మంది మరణించిన ఏ ఒక్క అధికారికి కూడా చీమకుట్టినట్టు కూడా లేదా?

ఇంకా ఎంతమంది చనిపోతే అధికారులు స్పందిస్తారో అంతు చిక్కని వారి వైఖరి ప్రజల మదిలో న్యాయం ఎవరు చేస్తారో అని ఒక మెలికైన ప్రశ్నగా మిగిలిపోయింది.

ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేరు అంటారు ఆ సామెతకు సరిగ్గా సరిపోయేలా ఎక్సెస్ శాఖ అధికారులే కంచ చేలు మేసినట్టుగా వారి విధులను తప్పు త్రోవ పట్టిస్తున్న పరిస్థితులు సరిగ్గా అద్దం పట్టేలా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో అధికారులే గుడుంబా విక్రయాలను అరికట్టకపోతే, ఇంకా ఎన్ని ప్రాణాలు చూడాల్సిన పరిస్థితి వస్తుందేమో అని మండల ప్రజలు పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ మధ్యకాలంలో చిన్న స్థాయి అధికారుల నుంచి పెద్ద స్థాయి అధికారి వరకు ఎక్సైజ్ శాఖలో అందరూ లంచానికి మరిగిన వారే అని మొన్నటి వరకు ప్రజలలో అనుమానాలు మాత్రమే ఉన్నాయి.అయితే దాన్ని నిజం చేస్తున్నట్టు వారి వైఖరి

ఎన్నిసార్లు పత్రికలలో ప్రచురించిన, చరవాణిల ద్వారా ఫిర్యాదు చేసిన గుడుంబా విక్రయాలపై స్పందించక పోవడం వారు లంచాలకు తలొగ్గారని నిజమని నమ్మేలా చేస్తున్నాయి అని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఏజెన్సీ మండలాలలో మద్యం విషయంలోపర్యవేక్షణ లోపం కారణంగా గుడుంబా విక్రయదారులు కల్తీ మందులు తయారు చేసి భారీగావిక్రయాలు జరిపిస్తూ ప్రజల ప్రాణాలను హరించి వేస్తున్నారన్నది నగ్నసత్యం. ఇప్పటి వరకు గుడుంబా సేవించి నాయకులగూడెంలో 97 మంది మరణించగా మరో ఇద్దరూ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారు చనిపోవడానికి ప్రధాన కారణం ఎక్సైజ్ శాఖ అని బల్లగుద్ది మరి చెప్పవచ్చు అంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఈ మేరకు గుడుంబా విక్రయాల పట్ల

ఈ నిర్లక్ష్యపు వైఖరిని అవలంబిస్తున్న ఎక్సైజ్ శాఖ గుడుంబాతో మరణించిన యువకుల మరణాలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఎక్సైజ్ శాఖ అధికారులు వారి ఐదు సంవత్సరాల జీతం డబ్బులు ఎక్స్గ్రేషియాగా ప్రకటించి మరణించిన వారికి చెల్లించాలని,, అంతేకాకుండా వారినిర్లక్ష్యానికి శిక్షగా చనిపోయిన వారి కర్మలకు కావలసిన డబ్బులు ఎక్సైజ్ శాఖ భరించాలని మండల ప్రజలు, విద్యావంతులు కోరుతున్నారు. ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి నాయకులగూడెం వీరభద్రారం అడవి ప్రాంతం లో జరిగే గుడుంబా విక్రయాలను విధులను సరిగ్గా నిర్వర్తించని అధికారులపై వేటు వేసి పూర్తిగా గుడుంబా విక్రయాలను అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు, బాధితులు పత్రికా ముఖంగా కోరుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !