గూగుల్‌కు పోటీగా కృత్రిమ మేధస్సుతో కూడిన సెర్చ్ ఇంజిన్ ‘చాట్ జీపీటీ ఏఐ’ను త్వరలో ఆవిష్కరించబోతున్నట్టు ‘ఓపెన్ ఏఐ’ తాజాగా ప్రకటించింది. ఇంతకు ముందు తాము తీసుకొచ్చిన ‘చాట్‌బోట్’ మాదిరి ఇది కూడా ప్రజాదరణ పొందుతుందని కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఇది ఇంటర్నెట్లోని సమాచారమంతా మనముందు ఉంచేలా చేస్తుందని, నెటిజన్‌కు ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.