టెలికాం సంస్థలు ఎన్నికల తర్వాత బిల్లులను పెంచాలని ప్లాన్ చేస్తున్నట్లు యాక్సిస్ క్యాపిటల్ వెల్లడించింది. 25% వరకు ఛార్జీలు పెంచి, యూజర్ల నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని(ARPU) పెంచుకోవాలని సంస్థలు భావిస్తున్నట్లు తెలిపింది. దీంతో టెలికాం ఆపరేటర్లకు ARPUలో 16% వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. అయితే యూజర్లపై పెద్దగా భారం పడకపోవచ్చని యాక్సిస్ క్యాపిటల్ అంచనా వేసింది.