- పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు…
- సమర్పించిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి .
మన్యం న్యూస్ మంగపేట.
హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల పంతొమ్మిది నుండి ప్రారంభమవుతున్న సందర్భంగా స్వామివారి కళ్యానానికి అరుదైన శీతల వాణిజ్య సుగంధ ద్రవ్య పంట సుగంధ రారాణి కాశ్మీర్ కుంకుమ పువ్వుని ఆలయ అర్చకులు స్వామి వారి కళ్యాణానికి వినియోగించనున్నారు ఈనెల ఇరువై మూడున ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులో జరగనున్న హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం సందర్భంగా జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివ రెడ్డి కాశ్మీర్ రాష్ట్రం నుండి స్వామి వారి కోసం ప్రత్యేకంగా తెప్పించిన శీతల సుగంధ పంట కుంకుమ పువ్వు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు గురువారం హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అధికారులు, అర్చకులకు సమర్పించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారి సన్నిధిలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ మల్లూరు లో ఈనెల ఇరువై మూడున జరగనున్న లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ ఉత్సవాలకు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ గా స్వామివారికి కాశ్మీరీ కుంకుమ పువ్వు ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు బహూకరించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని దేవుడి ఆశీస్సులు చల్లని దీవెనలు ప్రజలపై ఉండాలని ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలని ప్రార్థించినట్టు తెలిపారు. లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం రోజు కుంకుమ పువ్వు ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు స్వామి వారికి కల్యాణ మండపంలో సమర్పించాలని అనుకున్నామని కానీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కోడ్ అమల్లో ఉన్నందున దేవస్థానం అధికారులకు ముందుగానే గురువారం అందజేసినట్లు ఆయన తెలిపారు. సాంబశివరెడ్డి జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ గా భారత ప్రభుత్వం నుండి నియమితులైన దగ్గర నుండి గడిచిన నాలుగు సంవత్సరాలుగా స్వామి వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సుగంధ హారాలను సమర్పిస్తుండగా ఈ సంవత్సరం కాశ్మీరీ కుంకుమ పువ్వు సమర్పించడం విశేషం ఈ కార్యక్రమంలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ నేతాని సీతారాములు ఆలయ ప్రధాన అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు, క్లర్క్ నూతల కంటి అజయ్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.