UPDATES  

 కాంగ్రెస్ పార్టీలో దళితులే క్రియాశీలకం..రంజింప చేసినకాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం..

  • కాంగ్రెస్ పార్టీలో దళితులే క్రియాశీలకం..
  •  రంజింప చేసినకాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం.
  •   అన్ని పార్టీలలో కార్యకర్తలుగా దళితులే ఉన్నారు.
  •  కుల పిచ్చితో అహంకారంతో దళితులను చులకన భావంతో చూస్తే ఊరుకునేది లేదు.
  •  జిల్లా ఉపాధ్యక్షులు ఎడెల్లి గణపతి.

మన్యం న్యూస్ చర్ల.

 

మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఎస్సీ సెల్ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చింతిరియాల రవికుమార్, మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు మైపా జోగారావు పాల్గొన్నారు. జోగారావు అధ్యక్షతన, ఈ సమావేశం జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా మండల అధ్యక్షులు రుంజా రాజా ఆధ్వర్యంలో ఎస్సీ సెల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎడెల్లి గణపతి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు

ఈ సభను ఉద్దేశించి మాట్లాడుతూ

దళితుల అభివృద్ధి కాంగ్రె స్‌ పార్టీతోనే సాధ్యమవుతుంది అని నాటి, నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వాo దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని కాంగ్రెస్ , ఎన్నికలలో జిల్లాలో దళితుల పాత్ర ఎంతో ఉందని తెలిపారు , అనంతరం గౌరవ అధ్యక్షులు మైపా జోగారావు మాట్లాడుతూ జరుగుతున్న కుల మత వివక్షల నేపథ్యంలో బీజేపీని గెలిపిస్తే రాజ్యాంగం మార్పుతోపాటు దళితుల రిజర్వేషన్లు రద్దవుతాయని . గత నాయకుల పాలనలో దళితులకు ఒరిగిందేమీ లేదన్నారు. అన్ని పార్టీలలో దళితులు నాయకులు గా , కార్యకర్తలుగా ఉన్నారని, ప్రతి ఒక్క పార్టీ దళితున్ని సేవలు అందుపుచ్చుకొని ఎనలేని విజయాలు సాధిస్తున్న పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. పార్టీలలో ముఖ్య పాత్ర వహిస్తున్న దళితులకు వారి వారి స్థానాలను,బట్టి వివక్ష లేకుండా గౌరవించాలని, ఏ పార్టీ నాయకులైన గాని అహంభావంతో అహంకారంతో దళితులను చులకనా భావంతో చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దళితులంతా ఏకమై వారి గెలుపులో భాగస్వాములు అవుతారని వారన్నారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు, ఇల్లంగి ఆశీర్వాదం, చినిగిరి సుధాకర్, నిట్ట అబ్బులు , బండి అఖిల్, బట్ట బాలకృష్ణ, కర్రి మోహన్ రావు , బోళ్ల వినోద్, కర్రీ సంతోష్, చీతరగడ్డ రవి, చౌహన్ చిన్న,అశోక్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !