మరోసారి మహామ్మారి కరోనా కలకలం సృష్టిస్తోంది. సింగపూర్‌లో ఈ నెల 5 నుంచి 11 వరకు 25,900 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలంతా మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం వేవ్ ప్రారంభ దశలో ఉందని.. రానున్న 2-4 వారాల్లో భారీగా కేసులు నమోదవుతాయని అంచనా వేస్తోంది. రోజుకు 250 మంది ఆస్పత్రుల్లో చేరుతుండగా.. 60 ఏళ్లు పైబడిన వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు అదనపు డోస్ టీకా తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.