కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేశ్‌పై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. వర్సిటీలోని భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోకుండా కబ్జాదారులకు సహకరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు నిధుల దుర్వినియోగం, పీహెచ్‌డీ అడ్మిషన్ల ప్రక్రియ, పార్ట్‌టైం లెక్చరర్ల నియామకంలోనూ అక్రమాలు జరిగినట్టు ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది.
ఇప్పటికే అక్రమాలపై ఉద్యోగ, విద్యార్థి సంఘాలు తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. గతంలో విద్యార్థి సంఘాల వీసీ ఛాంబర్‌లో నిరసనలకు దిగారు. పీహెచ్‌డీ సీట్ల కేటాయింపులో అక్రమాలు జరిగట్లు వీసీపై ఆరోపణలు వచ్చాయి. వీసీపై ఫిర్యాదుల వర్షం వెల్లువెత్తడంతో తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటశం విచారణకు ఆదేశించారు.