పంటలు, ఆహార పదార్థాలపై క్రిమి సంహారక మందులు, ఇతర రసాయనాలు అధికంగా వాడడం వల్ల దేశవ్యాప్తంగా మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రానికి, పలు శాఖలకు నోటీసులు పంపింది. ఈ పిటిషన్‌కు స్పందించి, సమాధానాలు పంపాల్సిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వంతోపాటు వ్యవసాయ శాఖ, భారత్ ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) తదితరులకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ నోటీసులు పంపింది.