అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోమవారం నిర్వహించిన దాడుల్లో ఇద్దరు లంచావతారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల తాహసీల్దార్ మాధవి ఏసీబీకి చిక్కారు. ధరణి ఆపరేటర్ ద్వారా ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కన్నూరు గ్రామానికి చెందిన గోపాల్ మే 9న మీసేవలో విరాసత్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ క్రమంలో గోపాల్ నుంచి రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశారు. ఎమ్మెార్వో మాధవి తోపాటు ధరణి ఆపరేటర్ రాకేశ్ రూ. 5వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు.
పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగిన అధికారులు.. ఎమ్మార్వో మాధవి రూ. 5 వేలు, ధరణి ఆపరేటర్ రూ. 1000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ ఎమ్మార్వోపై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య