UPDATES  

 మరోసారి వాయిదా పడ్డ అంతరిక్ష యాత్ర..

అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ తన అంతరిక్ష యాత్రను వాయిదా వేస్తున్నట్లు నాసా ప్రకటించింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ తొలి అంతరిక్షయాత్ర మే 25వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. మంగళవారం రోజున ఫ్లోరిడా నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లాల్సి ఉండగా రాకెట్ పై భాగంలో హీలియం లీకేజ్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం సాంకేతిక నిపుణులు ఈ లీకేజ్ పై స్టడీ చేస్తున్నారు. వెంటనే మరమత్తులకు ఉపక్రమించారు.

 

అంతకుముందు ఈ నెల మొదట్లోనే స్టార్‌లైనర్ అంతరిక్షంలోకి బయలుదేరాల్సి ఉంది. అందులో అంతరిక్ష యాత్రికులు అంతా సిద్ధంగా ఉన్నారు కూడా. చివరి క్షణంలో రాకెట్ లిఫ్ట్‌ఆఫ్ సందర్భంగా సాంకేతిక సమస్య తలెత్తింది.దీంతో ఇది మే 21వ తేదీకి వాయిదా పడింది.ఇక మరోసారి హీలియం లీకేజ్ సమస్య తలెత్తడంతో మే 25వ తేదీకి వాయిదా పడింది. మరమత్తులు చేసేందుకు నిపుణులకు తగిన సమయం లభించిందని నాసా పేర్కొంది.

 

రాకెట్‌లో తలెత్తిన సాంకేతిక కారణాలతో వాయిదా పడటంతో అందులోని వ్యోమగాములు బుచ్ విల్మోర్, సునీత విలియమ్స్‌లు టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్‌లో బస చేస్తున్నారు. రాకెట్‌లో మరమత్తులు పూర్తయి సేఫ్‌ అని డిక్లేర్ చేసేవరకు వీరు అక్కడే బస చేస్తారు.ఇప్పటికే కొన్నేళ్లుగా ఈ అంతరిక్ష యాత్ర వాయిదా పడుతూ వస్తున్న తరుణంలో బోయింగ్ సంస్థకు ఇదొక పెను సవాలుగా మారింది.ముఖ్యంగా భద్రతాపరమైన అంశాల్లో వందేళ్ల చరిత్ర కలిగిన ఏరోస్పేస్ కంపెనీ ఈ యాత్రను చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుని విజయవంతం చేయాలనే సంకల్పంతో ఉంది.

 

ఇదిలా ఉంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌‌కు వ్యోమగాములను తీసుకెళ్లి, మిషన్ పూర్తయ్యాక భూమికి సురక్షితంగా తిరిగి చేరుకోవడం ఒకసారి విజయవంతంగా ముగిసింది. రెండో సారి వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు బయలుదేరుతున్నారు.ఈ సారి నాసా దృష్టి అంతా బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌పై ఉంది. అంతకుముందు ఎలాన్ మస్క్‌ కంపెనీ స్పేస్ ఎక్స్‌ నుంచి డ్రాగన్ క్యాప్సూల్‌లో 2020లో సక్సెస్‌ఫుల్‌గా వ్యోమగాములు వెళ్లి వచ్చారు. అయితే అప్పటి వరకు రష్యాకు చెందిన రాకెట్లలోనే వ్యోమగాములు స్పేస్ స్టేషన్‌కు వెళ్లి వస్తుండగా… తొలిసారిగా స్పేస్ ఎక్స్ ఆ రికార్డును చెరిపివేసింది. ఇప్పుడు బోయింగ్ సంస్థ నుంచి స్టార్ లైనర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !