మన్యం న్యూస్ దుమ్ముగూడెం(మే 23)::
మండలంలోని మారుమూల ఏజెన్సీ సుజ్ఞానపురం గ్రామంలో దుమ్ముగూడెం పోలీస్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ గురువారం నిర్వహించారు. ఆపరేషన్ లో ఎటువంటి పత్రాలు లేని 15 మోటార్ సైకిల్ ను గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించారు ఇటీవల కాలంలో దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో నాటుసార కేసులు ఎక్కువగా నమోదవుతున్నందు ఈ కేసు లో సుజ్ఞానపురం గ్రామస్తులు ఎక్కువ మొత్తంలో పట్టుబడడంతో గ్రామస్తులు అందర్నీ నాటు సారా తయారీ , అమ్మకం చేయకుండా ఉండేందుకు గ్రామ పెద్దల చేత తగు కౌన్సిలింగ్ ఇచ్చి వారిచేత హామీ తీసుకోవడం జరిగింది. ఈ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ లో సీఐ అశోక్ ఎస్సైలు కేశవరావు గణేష్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.