మన్యం న్యూస్ దుమ్ముగూడెం (మే 23)::
నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి లో భాగంగా కాంగ్రెస్కు పార్టీ మద్దతివ్వాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా మాస్ లైన్ కమిటీ నిర్ణయించింది అనీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ తెలిపారు. గురువారం మండలంలోని మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం కోసం ఇండియా కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తునమని, మతోన్మాద బిజెపిని అహంకార బీఆర్ఎస్ ఓడించాలని అన్నారు. కాంగ్రెస్ పట్టభద్రుల అభ్యర్థి తీన్మార్ మల్లన్న విద్యావంతులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు పార్టీ శ్రేణులు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి దాసరి సాయన్న వీరభద్రం శంకర్ బాబు సత్తన్న వీరన్న తదితరులు పాల్గొన్నారు.