- తునికాకు కార్మికులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ పల్టీ ఎనిమిది మందికి గాయాలు
- మెరుగైన వైద్యం కోసం ముగ్గురిని ఖమ్మం తరలింపు
- ప్రమాద బాధితులకు అండగా నిలిచిన ఎస్సై కిన్నెర రాజశేఖర్ సేవలు అమోఘం
మన్యం న్యూస్ గుండాల: తునికాకు కార్మికులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ పల్టీ పడడంతో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. గుండాల మండలం చీమల గూడెం గ్రామానికి చెందిన 25 మంది తునికాకు కార్మికులు ఆకు సేకరించి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో గుట్టమీద ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ముగ్గురికి దెబ్బలు ఎక్కువ తగలడంతో మెరుగైన వైద్యం కోసం వారిని ఖమ్మం తరలించారు ప్రమాద సంఘటన తెలుసుకున్న గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ సంఘటన స్థలానికి వెళ్లి బాధితులను గుండాల ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందించారు అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని ఖమ్మం పంపియడంతో ఎస్సై కిన్నెర రాజశేఖర్ చేసిన కృషిని గ్రామస్తులు అభినందిస్తున్నారు