మన్యం న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం పొదుమూరు గ్రామానికి చెందిన మహమ్మద్ యాకుబ్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం జబ్బోనిగూడెం లో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి చనిపోయాడు. అతనికి భార్య రేష్మ,ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిది చాలా పేదకుటుంభం. ప్రతిరోజూ రెక్కడితే డొక్కాడని కుటుంబం. పని చేసి పిల్లలను పోషణ చూసుకునే యాకుబ్ చనిపోవడం ఆ కుటుంబం చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది.భర్త చనిపోయాడన్న బాధ తట్టుకోలేక భార్య కూడా మనస్తాపంకు గురై చనిపోయింది.ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలు అనాధలుగా మిగిలిపోయారు.ఈ విషయం తెలుసుకున్న జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ వారు దాతలసహకారంతో వీరికి 25000 రూపాయలు మరియు 25 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది.ట్రస్ట్ ఛైర్మన్ కోడెల నరేష్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సహాయం అందించాలని ఇప్పటివరకు జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఏ ప్రోగ్రామ్ చేసిన సహాయం అందిస్తున్న దాతలందరికి పాదాభివందనం తెలియజేస్తున్నామని దాతలసహకారం మరువలేనిదని ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఇలాంటి వారికి సహాయం అందించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్, ప్రధానకార్యదర్శి మునిగాల రాకేష్, ఉపాధ్యాక్షులు కస్ప ముకుందాం, కోశాధికారి కొండపర్తి నగేష్, ప్రచారకార్యదర్శి గగ్గురి మహేష్, గౌరవసలహాదారులు సయ్యద్ బాబా,తునికి వెంకటేశ్వర్లు, సభ్యులు కాజా పాషా, చోటు, తదితరులు పాల్గొన్నారు.