మన్యం న్యూస్ మంగపేట.తేదీ:25-05-2024, కొత్తగూడెం: వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోండ్వానా దండకారణ్య పార్టీ(జీడీపీ) అభ్యర్థిగా నిలిచిన సోడే వెంకటేశ్వర్లు గారికి బ్యాలెట్ పేపర్ లోని క్రమ సంఖ్య 14 నందు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, పోటీలో ఉన్నటువంటి సోడే వెంకటేశ్వర్లు, అడ్వకేట్ నిరుద్యోగులకి అండగా ఉండి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలను అట్టడుగున ఉన్న ఆదివాసుల అందే విధంగా కృషి చేశారని, అంతే కాకుండా నిరుద్యోగులు మరియు ఉద్యోగుల పట్ల వారి సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న సోడే వెంకటేశ్వర్లు,అడ్వకేట్ కి అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని పార్టీ ములుగు జిల్లా నాయకులు, పోలేబోయిన ఆదినారాయణ అభ్యర్థించారు. తెలంగాణలో ఏర్పడిన ప్రభుత్వాలు ఉద్యోగ నియామక క్యాలెండర్ను విడుదల చేసి దాన్ని పాటించడంలో చేతులెత్తేసారని, కోర్టు కేసులతో అర్హత కలిగిన వారికి ఉద్యోగ నీయామక పత్రాలు ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ అనేక ఇబ్బందులు గురిచేస్తూ సమస్యలు పెరిగిపోతున్నాయని వాటిని పట్టించుకోలేని అభ్యర్థులు, నేడు పట్టభద్రుల సమస్యలు పరిష్కారం కోసమని ఓట్లు అభ్యర్థించడం హాస్యాస్పదం అని , నిరుద్యోగుల పట్ల వారి యొక్క కపట ప్రేమను పట్టభద్రులందరూ గమనించాలని ముఖ్యంగా వారు శాసన మండలిలో కూర్చుని ప్రభుత్వాల భజన చేయకుండా నిరుద్యోగుల ఉద్యోగుల గొంతుకగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సామరస్య పూర్వక వాతావరణంలో సమస్యల పరిష్కరించేందుకు కృషి చేసే సోడే వెంకటేశ్వర్లు, అడ్వకేట్ గారిని గెలిపించాలని మరియు రానున్న కాలంలో విద్య వ్యవస్థలో మార్పులు తేవడంతో పాటు నేటికీ అనేక వర్గాలు వారికి అవకాశాలు రాలేకపోతున్న , వారి తరపున సమస్యలను ప్రశ్నించేవారు కరువయ్యారని, ఉద్యోగాల విషయంలో ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేక నియామక చట్టం కొరకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల అందరి పైన ఉన్నందున బాధ్యతగా ప్రతి ఒక్కరూ మహిళలు, విద్యార్దులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఓటింగ్ లో పాల్గొని పార్టీ తరపున పోటీలో ఉన్నటువంటి సోడే వెంకటేశ్వర్లు, అడ్వకేట్ కి మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు.