మన్యం న్యూస్, మంగపేట.
ములుగు జిల్లా రాజుపేట కెనరా బ్యాంక్‌లో తాకట్టు బంగారం మాయమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వ్యవసాయం నిమిత్తం పలువురు రైతులు సదరు శాఖలో బంగారం తాకట్టు పెట్టుకుని రుణం తీసుకు న్నారు. కోటి 44 లక్షల విలువ చేసే దాదాపు రెండు కిలోల మేర బంగారంను బ్యాంక్ అప్రైజర్ కొట్టేసి నట్లు వార్షిక ఆడిట్‌లో అధికారులు గుర్తించారు.
బ్యాంకులోని నిల్వలకు తాకట్టు లెక్కలకు పొంతన లేకపోవడంతో బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకె ళ్లారు.దీoతో వెంటనే మేనేజర్ బ్యాంక్ అప్రైజర్‌ను సంప్ర దించేందుకు ప్రయత్నం చేయగా… ఆయన అప్పటికే గ్రామం విడిచి భార్య, పిల్లలతో ఉడాయిం చినట్లు తెలుస్తోంది.ఇదే విషయమై మంగపేట పోలీసులకు బ్యాంక్ మేనే జర్ ఫిర్యాదు చేశారు. మంగపేట ఎస్.ఐ రవికుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం బ్యాంకు అప్రైజర్ అంటే నాణ్యత, పరిమాణం, విలువ తెలుసుకొని తద్వారా ఆ నగలకు ఎంత నగదు ఇవ్వొచ్చు అని లెక్క కట్టేవాడు, అటువంటి అప్రైజర్ చేతికి కోట్ల రూపాయలు విలువ చేసే నగలు ఎలా ఇస్తారు, లేదా ఎలా దొరుకుతుంది, నగలు మాత్రమే పోయాయా ఇందులో బ్యాంకు సిబ్బంది ఎవరిది అయినా హస్తం ఉందా అంటూ ప్రజలు తమ ఆందోళన ను వ్యక్తం చేస్తున్నారు.ప్రజలు ఎటువంటి ఆందోళనకు లోను కావాల్సిన అవసరం లేదని చట్టం తన పని తాను చేస్తుంది అని
బాధితులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా, ప్రస్తుత రేటు ప్రకారం డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తామని కెనరా బ్యాంక్ అడిషనల్ డిప్యూటీ మేనేజర్ శ్రీనివాస రావు తెలిపారు.