మన్యం న్యూస్ గుండాల: బిఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపుకై కృషిచేసిన పార్టీ ప్రజా ప్రతినిధులకు, పార్టీ నాయకులకు, ఓటు వేసిన పట్టాభద్రులకు ప్రత్యేక ధన్యవాదాలు పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. ఎన్నికల ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ భారీ మెజార్టీతో రాకేష్ రెడ్డి గెలవబోతున్నారని అన్నారు. కష్టపడిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు
