మన్యం న్యూస్ దుమ్ముగూడెం (మే 28)::
మండలంలో నాటు సారా స్థావరాలపై మంగళవారం సీఐ అశోక్ ,కొత్తగూడెం స్పెషల్ పార్టీ పోలీసులు ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు.ఈమేరకు మండల పరిధిలోని సుజ్ఞానపురం గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు జరిపి 2500 లీటర్ల బెల్లం పానకాన్ని, 60 లీటర్ల నాటు సారా 10 ప్లాస్టిక్ డమ్ములను ధ్వంసం చేసి సారా కి తయారీకి ఉపయోగించే 15 ప్లాస్టిక్ డ్రమ్ములను స్టీలు బిందెలను ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ తెలుపుతూ మండలంలోని కొంతమంది అక్రమ సంపాదన కోసం అమ్మోనియా వంటి విసపూరిత రసాయలను కలుపుతూ నాటసార తయారుచేసి విక్రయిస్తున్నారని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్సై కేశవరావు స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.