మన్యం న్యూస్ దుమ్మగూడెం (మే 28)::
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లావు సన్నం అనే తేడా లేకుండా వడ్లకు బోనస్ను ప్రకటించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ములకపాడు గ్రామంలో సీతారామయ్య భవనంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ .. ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా బోనస్ను ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ తునికాకు బోనస్ విడుదల చేయాలని కోరారు. రానున్న వర్షాకాలం సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని, సీజనల్ వ్యాధుల పట్ల ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు శ్రీనుబాబు వీర్రాజు పున్నారావు మిడియం జయ సోషల్ మీడియా మండల కన్వీనర్ కుమ్మరి కుంట సాంబశివరావు కామయ్య తదితరులు పాల్గొన్నారు.