ప్రముఖ దేశీయ విమనయాన సంస్థ ‘ఇండిగో’ మహిళల కోసం సరికొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. దీని ద్వారా విమానంలో మహిళలు ఎక్కడెక్కడ సీట్లు బుక్ చేసుకున్నారో తెలుసుకోవచ్చు. దీంతో, ఇకపై మహిళలు వెబ్ చెక్-ఇన్ సమయంలో ఇతర మహిళా ప్రయాణికులు బుక్ చేసుకున్న సీట్లు ఏంటో చూడొచ్చు. ‘ప్రస్తుతానికి పైలట్ మోడ్లో దీన్ని అందుబాటులోకి తెచ్చాం’ అని ఇండిగో తమ ప్రకటనలో వెల్లడించింది.
