విజయ్ ఆంటోని హీరోగా శశి తెరకెక్కించిన చిత్రం ‘బిచ్చగాడు’ మూవీ ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన ‘బిచ్చగాడు 2’ దానికి మించిన సక్సెస్ అందుకుంది. దీంతో పార్ట్-3 కోసం అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. తాజాగా ఇంటర్వ్యూలో విజయ్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ‘బిచ్చగాడు-3’ కచ్చితంగా ఉంటుందన్నారు. 2026 వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.
