‘కల్కి 2898 ఏడీ’ చిత్రం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘బుజ్జి’ అనే వాహనాన్ని డ్రైవ్ చేయాలంటూ టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్ కోరారు. ఎక్స్ వేదికగా ఆయన్ను ఆహ్వానించారు. బుజ్జి ఎలా తయారు అయ్యిందో కూడా వివరించారు. కాగా, ఆ వెహికల్‌ను పలు నగరాల్లో నడుపుతూ టీమ్ మూవీ ప్రమోషన్స్ చేస్తోంది.
