స్టార్ హీరోయిన్ దీపికా మరో ఘనతను సాధించారు. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ.. దశాబ్దకాలంగా ఎక్కువ ప్రజాదరణ పొందిన 100 మంది భారతీయ నటీనటుల జాబితాను విడుదల చేసింది. ఇందులో టాప్ 1లో దీపికా పదుకొణె నిలిచారు. అలాగే ఈ వరుసలో సమంత 13వ స్థానంలో ఉన్నారు. సౌత్ నుంచి టాప్ 15లోపు నిలిచిన స్టార్ సమంత కావడం విశేషం.
