మన్యం న్యూస్ గుండాల: పాఠశాల ఖర్చుల లెక్కలు చెప్పని పడుగొని గూడెం పాఠశాల ఉపాధ్యాయుడికి దారి చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర చారి. ఉపాధ్యాయులు పాఠశాల ఖర్చులు సరైన సమయంలో లెక్క చెప్పకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మండలంలో పర్యటించిన ఆయన అమ్మ ఆదర్శ పాఠశాలలను సందర్శించారు ముక్తాపురం ముక్తి గుంపు పాఠశాలలో అవసరం ఉన్నప్పటికీ ఎస్టిమేషన్ వేయకుండా ఉన్న ఉపాధ్యాయులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అధికారులతో సమావేశం నిర్వహించి 3 తారీకు నుండి 18 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంఈఓ కృష్ణయ్య, ఎంఎన్ఓ పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు
