ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో బ్యాంకు ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు ఎర వేశారు. షేర్ మార్కెట్‌లో లాభాలు వస్తాయంటూ నమ్మించి రూ.34 లక్షలు కొట్టేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే లింకులను ఓపెన్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
