UPDATES  

 జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోవిద్యార్థులకు సన్మానం…

మన్యం న్యూస్ మంగపేట. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మంగపేట మండలం లో ఎస్ ఎస్ సి 2024 సంవత్సరము 9 జి పి ఎ కంటే అధికంగా జి పి ఎ సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రధాన ఉపాధ్యాయులను `జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానం మరియు ట్రోఫీ లతో సన్మానం చేశారు.
.. ఈ సందర్బంగా ట్రస్ట్ గౌరవ సలహాదారు శ్రీ నరేశరెడ్డి, మాట్లాడుతూ ప్రభుత్వ బడి చాలా అనుభవం అర్హత ఉన్న _ఉపాధ్యాయులు ఉన్నారని నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ పాఠశాల లో చేర్పించాలని కోరారు. అనంతరం ఈ రోజు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జ్వాలా ట్రస్ట్ ఆఫీస్ లో ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి 20 మంది తో ఏటూరునాగారం గవర్నమెంట్ హాస్పిటల్ వారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో
జ్వాలా ట్రస్ట్ అధ్యక్షులు కోడెల నరేష్ ప్రధాన కార్యదర్శి మునిగాల రాకేష్, గౌరవసలహాదారులు కొలగట్ల నరేష్ రెడ్డి , సయ్యద్ బాబా, మంగపేట జూనియర్ కోలేజి ప్రిన్సిపాల్ గూల్ల వెంకటయ్య , జడ్పి ఎచ్ ఎస్ మంగపేట ప్రధానోపాధ్యాయులు శ్రీమతి పోడెం మేనకా, జడ్పి ఎచ్ ఎస్ కమలాపురం ప్రధానోపాధ్యాయులు గడ్డి శ్రీనివాస్, జడ్పీ ఎచ్ ఎస్ మల్లూరు ప్రధానోపాధ్యాయులు భద్రయ్య, ఎం ఈ ఓ ఆఫీస్ శ్రీధర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమలాపురం ఛైర్పర్సన్ అనిత, మంగపేట ఛైర్పర్సన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !