హైదరాబాద్‌లో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. పబ్‌ల యజమానులతో కలిసి పలువురు అమ్మాయిలు డేటింగ్ యాప్ మోసానికి పాల్పడుతున్నారు. వ్యాపారవేత్తలను బుట్టలో వేసుకుని మోసం చేస్తున్నారు. వారితో పరిచయం పెంచుకుని పబ్‌కు పిలుస్తున్నారు. వారి నుంచి రెండింతల డబ్బు వసూలు చేస్తున్నారు. హైటెక్ సిటీలోని మోష్ పబ్‌తో పాటు పలు పబ్‌లు ఇలాంటి మోసాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.