స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన స్టార్షిప్ మెగా రాకెట్ ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైంది. మానవులను అంగారకుడు, చందమామపైకి తీసుకెళ్లేందుకు స్పేస్ఎక్స్ సంస్థ దీన్ని రూపొందించింది. ఈ భారీ రాకెట్లో రెండు అంచెలున్నాయి. ఇందులో ‘సూపర్ హెవీ’ రాకెట్ బూస్టర్, దానికి ఎగువన స్టార్షిప్ వ్యోమనౌక ఉన్నాయి. 200 కిలోమీటర్ల ఎత్తువరకు వెళ్లి, అనంతరం సురక్షితంగా హిందూ మహాసముద్ర జలాల్లో దిగింది.