హీరోయిన్ సునైన పెళ్లికి రెడీ అయింది. తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని తాజాగా ఆమె వెల్లడించింది. కాబోయే భర్త వేలిని పట్టుకున్న ఫోటో సోషల్మీడియాలో షేర్ చేస్తూ తన నిశ్చితార్థం జరిగిందని పేర్కొంది. అభినందనలు చెప్పే ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది. అయితే తను పెళ్లి చేసుకోబోయేది ఎవరన్నది మాత్రం చెప్పలేదు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది.