ప్రభాస్ ‘కల్కి’ సినిమా ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రేక్షకులను ఉద్దేశించి ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశారు. ‘ఈరోజును చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. కానీ ఇది తెలుగు ప్రేక్షకులుగా, భారతీయులుగా, సినీ ప్రేమికులుగా మనం గర్వించేలా ఉంటుందని ఆశిస్తున్నా. మా టీమ్ మొత్తం కల్కి ప్రపంచాన్ని మీతో పంచుకోవడానికి ఎదురుచూస్తోంది’ అని నాగ్ రాసుకొచ్చారు.