తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఇటీవల కొత్తగా ఐదు మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతులను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా ట్రోల్స్, మద్యం ప్రియుల నుంచి వస్తున్న వ్యతిరేకత, ఉత్పత్తుల నాణ్యత, ప్రామాణికతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు సమాచారం. ఈ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో కంపెనీలకు ఇవ్వాల్సిన అనుమతులను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది.