జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన స్టార్ హీరో రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘నేడు ఎంతో ఆనందంగా ఉంది. తమకు ఇది మహోజ్వలమైన రోజు’’ అని అభివర్ణించారు. బాబాయ్ ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇంతటి ఘన విజయం సాధించారని అన్నారు. పిఠాపురంలో తన బాబాయ్ పవన్ కళ్యాణ్ సాధించింది 100 శాతం చారిత్రక విజయం అని అభిప్రాయపడ్డారు.
