స్టార్ హీరోయిన్ సమంత మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సినిమాలో నటించనుందట. గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రంలో నటించేందుకు ఆమె ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మూవీలో ఆమె ఎలాంటి పాత్రలో నటిస్తుందనే విషయంపై క్లారిటీ రావాల్సివుంది. సామ్‌కు ఇది ఫస్ట్ మలయాళం సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సివుంది.
