తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసైకి నిన్న హోంమంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారనే వార్తలపై ఆమె స్పందించారు. ‘నిన్న నేను హోంమంత్రి అమిత్ షాను కలిశాను. 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి, ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఆయన నన్ను అడిగారు. రాజకీయంతో పాటు నియోజకవర్గ పనులను చూసుకోవాలని సూచించారు. నా గురించి వస్తున్న ఊహాగానాలకు స్పష్టత ఇవ్వడానికి ఈ పోస్టు’ అని ట్వీట్ చేశారు.
